PRATHIDWANI: రాష్ట్రంలో పంటల బీమా పొందుతున్న రైతులెందరు?
🎬 Watch Now: Feature Video
రాష్ట్రంలో పంటల బీమా అందక రైతులు అగచాట్ల పాలవుతున్నారు. ఈ-పంట, ఈ కేవైసీ పేరుతో ప్రభుత్వం లెక్కలెన్ని చెబుతున్నా... అర్హులైన రైతులందరికీ పరిహారాలు అందించే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. చాలాచోట్ల పంటలు నష్టపోయి, పెట్టుబడులు చేతికిరాక అప్పుల్లో కూరుకుపోయిన కౌలు రైతులు ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారు. అసలు రైతులుగా గుర్తింపు కూడా లభించని స్థితిలో వీరు బీమాకు నోచుకోవడం లేదు. మరోవైపు అనర్హులకు బీమా పరిహారాలు ఇస్తున్నారన్న విమర్శలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు రాష్ట్రంలో పంటల బీమా పొందుతున్న రైతులెందరు? బీమా అక్రమాలపై రైతుల ఫిర్యాదులను ప్రభుత్వం స్వీకరిస్తోందా? లేదా? ఇదే అంశంపై ఈ రోజు ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST