Three People Died in Heavy water flow విహారయాత్ర మిగిల్చిన విషాదం..! వాగులో మునిగి ముగ్గురు యువకులు మృతి! - AP Latest News
🎬 Watch Now: Feature Video
Three People Died in Canal: విహారయాత్రకు వచ్చి వేరువేరు ఘటనలలో ముగ్గురు మృతి చెందిన విషాద ఘటన అల్లూరి జిల్లాలో చోటుచేసుకుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి ఏడుగురు మిత్రులు వెళ్లారు. వారంతా మారేడుమిల్లి సమీపంలోని పాములేరు వాగులో స్నానానికి దిగగా అందులో మునిగి ఇద్దరు యువకులు చెందారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారు మాదాల సురేష్ ఆటో డ్రైవర్, తేజస్ వర్మ వాలంటీర్‌గా గుర్తించారు. మృతదేహాలను అదే కార్లో రంపచోడవరం ఆసుపత్రికి తరలించారు.
Another Person Died in Polluru Waterfall: చింతూరు మండలం మోతుగూడెం పొల్లూరు జలపాతంలో ప్రమాదవశాత్తు కాలుజారి సాఫ్ట్వేర్ పర్యాటకుడు మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి కాజా హేమంత్గా గుర్తించారు. హేమంత్ హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. రాజమండ్రిలో మిత్రులతో కలిసి ఈ జలపాతానికి వచ్చి జారిపడి మృతి చెందాడు. ఇలా ఆదివారం మన్యం పర్యటనకు వచ్చి విహారంలో మృతి చెందడంతో వారి కుటుంబాలలో విషాదం మిగిలింది.
TAGGED:
ఏపీ ప్రమాద వార్తలు