Three Died In Road Accidents in AP: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి.. ఇద్దరు చిన్నారులు సేఫ్ - Andhra Pradesh Couples Died In Road Accident
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 1, 2023, 2:24 PM IST
Three Died In Road Accidents in AP: రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు వ్యక్తులు మరణించగా.. పలువురికి గాయాలయ్యాయి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు జాతీయ రహదారిపై ఆగి ఉన్న పోలీసు వాహనాన్ని లారీ ఢీకొంది. ప్రమాదంలో ఇద్దరు ఎస్సైలకు మరో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ఏలూరులో ట్రైనింగ్ ముగించుకుని.. నెల్లూరు వచ్చి అక్కడి నుంచి ఆత్మకూరు వస్తూ మధ్యలో ఆగారు. ఆ సమయంలో లారీ ఢీ కొట్టింది. ఏఎస్ పేట ఎస్ నరేష్, మర్రిపాడు ఎస్ విశ్వనాథం, డ్రైవర్ రమణకు గాయాలయ్యాయి. చికిత్స కోసం వారిని ఆత్మకూరు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఏఎస్ పేట ఎస్సై నరేష్‌కు తీవ్రగాయలవటంతో మెరుగైన చికిత్స కోసం నెల్లూరు తరలించారు.
అనకాపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి (Couples Died In Road Accident) చెందిన ఘటన విషాదాన్ని నింపింది. జిల్లాలోని కె. కోటపాడు మండలం బొట్టవానిపాలెం వద్ద ఈ ప్రమాదం జరగగా.. విశాఖలోని ఆరిలోవకు చెందిన దామోదరరావు, ప్రసన్న లక్ష్మి ప్రాణాలు కోల్పోయారు. వారు ఇద్దరి పిల్లలతో కలిసి వేచలం గ్రామానికి స్కూటీపై వెళ్తుండగా.. లారీ వెనక చక్రాల దంపతులిద్దరూ పడిపోగా.. ప్రమాదంలో పిల్లలు స్వల్పగాయలతో బయటపడ్డారు. చికిత్స కోసం వారిని కె.కోటపాడు ఆసుపత్రికి తరలించారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామ సమీపంలోని జాతీయ రహదారిపై.. రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటాయపాలెం గ్రామానికి చెందిన శ్రీనివాసరావు ఎలక్ట్రికల్ స్కూటీపై వెళ్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొంది. ఘటనలో శ్రీనివాసరావు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. పోలీసులు ఘటన స్థలికి చేరుకుని మృతదేహాన్ని నందిగామ మార్చూరీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.