Indrakeeladri Celebrations ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి శాకాంబరిదేవి రూపంలో అమ్మవారు.. పోటెత్తిన భక్తులు.. - విజయవాడ లేటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video
Shakambari Festival Celebrations: ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడలో ఇంద్రకీలాద్రిపై శాాకాంబరి ఉత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. గత పుష్కరకాలం(12 సంవత్సరాలు)నుంచి ప్రతి ఆషాఢ మాసంలో మూడు రోజులపాటు ఆలయంలో ఈ ఉత్సవాలను నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి కూడా మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. దీనిలో భాగంగా తొలిరోజు అమ్మవారి మూలవిరాట్ సహా ఆలయాన్ని కూరగాయలు, పండ్లు, వివిధ రకాల డ్రై ఫ్రూట్స్‌తో అలంకరించారు. ఉపాలయాలకు కూరగాయలతో తోరణాలు కట్టి ప్రత్యేకంగా అలంకరణ చేశారు. ఈ ఉత్సవాలకు భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు మొక్కులను చెల్లించుకున్నారు. ఈ క్రమంలో ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎలాంటి అసౌర్యాలు కలుగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దీంతోపాటు ఉత్సవంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దర్శనానికి వచ్చే దుర్గమ్మ భక్తులకు ఉత్సవాలు జరిగే మూడు రోజుల పాటు కదంబం ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.