Pawan fire on YSRCP: గోదావరి జిల్లాల్లో వైసీపీ ఒక్క సీటు కూడా గెలవద్దు.. జనసేన జెండా ఎగరాలి: పవన్ - varahi victory yatra updates
🎬 Watch Now: Feature Video
Pawan Kalyan fire on Ysrcp: ఉమ్మడి గోదావరి జిల్లాల్లో వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాకూడదని.. 2024 ఎన్నికల్లో కాకినాడలో జనసేన పార్టీ జెండా ఎగిరేలా పార్టీ కార్యకర్తలు, ముఖ్య నేతలు పని చేయాలని.. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. వారాహి విజయ యాత్రలో భాగంగా ఆయన నేడు భీమవరంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా పవన్ కల్యాణ్ సమక్షంలో కాకినాడకు చెందిన తోట సుధీర్, మరికొంత మంది జనసేన పార్టీలో చేరారు.
జనసేనలోకి పెద్ద సైన్యం వచ్చింది.. పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. సమర్థత, పోరాడే నాయకులు రాజకీయాల్లో రావాలని పిలుపునిచ్చారు. జనసేనలోకి తోట సుధీర్‌ని సాదరంగా ఆహ్వానిస్తున్నామన్నారు. తోట సుధీర్‌తో పాటు ఇవాళ జనసేనలోకి పెద్ద సైన్యమే వచ్చిందని వ్యాఖ్యానించారు. నేరస్తులను ఎదుర్కోవాలంటే చట్టాలపై అవగాహన ఉన్న వ్యక్తులు రాజకీయాల్లో ఉండాలన్నారు. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ జెండా కాకినాడలో ఎగరాలన్నారు. ఉభయ ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఒక్క సీటు కూడా వైసీపీకీ రాకూడదన్నారు. ఇప్పటి నుంచే ప్రతి జనసేన కార్యకర్త వైఎస్సార్సీపీ జెండా ఎగరకూడదన్న లక్ష్యంతో పని చేయాలని సూచించారు.
వైసీపీకీ ఒక్క సీటు కూడా రాకూడదు.. ''చట్టాలపై అవగాహన ఉన్న వ్యక్తుల్లో తోట సుధీర్ ఒకరు. తోట సుధీర్ కుటుంబంతో నాకు సాన్నిహిత్యం ఉంది. పార్టీ బలంగా ఉండాలంటే అందరి మద్దతు అవసరం. వచ్చే ఎన్నికల్లో కాకినాడలో జనసేన జెండా ఎగరాలి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీకీ ఒక్క సీటు కూడా రాకూడదు. వైసీపీ ఎందుకు రాకూడదో అందరికీ తెలుసు. పోరాటం చేసే వారిపై కేసులు పెడుతున్నారు. ఉద్యోగులకు సమయానికి జీతాల్లేవు. రైతులకు మద్దతు ధర లేదు. మళ్లీ వచ్చే నెల 4, 5 తేదీల్లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో పర్యటిస్తా''- పవన్ కల్యాణ్, జనసేన అధినేత