దొంగతనానికి వెళ్లిన వ్యక్తిని వెంటాడిన మృత్యువు - మూడు రోజుల తర్వాత! - thief news in east godavari
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 26, 2023, 4:33 PM IST
Thief Died Accidentally in East Godavari: ఓ వ్యక్తి దొంగతనం కోసం ఇంటికి వెళ్లాడు. ఆ ఇంట్లోనే కాకుండా చుట్టు పక్కన ఇళ్లలో ఎవరూ లేరు. అదృష్టం బావుంది దొరికిన కాడికి సర్దుకుని పారిపోదాం అనుకుని, మెల్లగా భవనంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించాడు. కాని దురదృష్టం వెంటాడి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పొయాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.
Thief Died on Spot After Falling on Gate: నిడదవోలు గణపతి సెంటర్లో తాళం వేసిన ఒక ఇంట్లో చోరీ చేయడానికి వెళ్లిన సమయంలోో ఇంటి బయట ఉన్న ఇనప గేటు మీదపడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. చుట్టు పక్కల ఇళ్లు కూడా తాళాలు వేసి ఉండడంతో ఎవరూ గుర్తించలేదు. దీంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం చుట్టు పక్కల స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వటంతో ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సుమారు మూడు రోజులు క్రితం సంఘటన జరిగి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు.