ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ సర్వం సిద్ధమైన విశాఖ - test match visakha
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 12, 2024, 2:05 PM IST
Test Match Between India and England in Visakha : ఇండియా- ఇంగ్లాండ్ మధ్య జరిగే టెస్ట్ మ్యాచ్కు విశాఖలోని వీడీసీఏ స్టేడియం వేదిక కానుంది. ఫిబ్రవరి 2 నుంచి 6 వరకు జరుగుతున్న మ్యాచ్కు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 15 నుంచి ఆన్లైన్లో టికెట్లు అందుబాటులో ఉంటాయని ఏసీఏ కమిటీ సభ్యులు వెల్లడించారు. అలాగే జనవరి 26 నుంచి ఆఫ్లైన్లో టికెట్లు అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. జీవీసీఏ, స్వర్ణ భారత్ స్టేడియాల్లో ఆఫ్లైన్ టికెట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. అదే విధంగా రోజుకు 2000 మంది విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పిస్తామని ఏసీఏ కమిటీ సభ్యులు తెలిపారు.
రెండు క్రికెట్ జట్లకు సంబంధించిన అన్ని సౌకర్యాలు ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ మల్లిఖార్జున అన్నారు. స్టేడియం దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘనలు జరగకుండా చర్యలు తీసుకున్నామని నగర సీపీ శంకర్ అయ్యర్ తెలిపారు. మ్యాచ్ను దృష్టిలో పెట్టుకొని నగరంలో ట్రాపిక్ సమస్యలు తలెత్తకుండా చూస్తామని పేర్కొన్నారు.