Terror of ycp leaders in Chittoor District వైసీపీ శ్రేణుల ఆగడాలు.. టీడీపీ బ్యానర్లను చింపేసి.. అమరరాజా ఉద్యోగులపై దాడి చేసి.. - Chittoor District Bandh

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 5, 2023, 8:27 PM IST

Terror of ycp leaders in Chittoor District పుంగనూరు ఉద్రిక్తతలకు తెలుగుదేశం అధినేత చంద్రబాబే కారణమంటూ వైసీపీ నేతలు.. చిత్తూరు జిల్లా బంద్‌కు పిలుపునిచ్చారు. బంద్‌లో భాగంగా చిత్తూరులో.. వైసీపీ నేతలు అమరరాజా సంస్థ బస్సును రోడ్డుపై ఆపేశారు. బస్సు టైరులో గాలి తీసివేశారు. బస్సులోకి వెళ్లి.. ఉద్యోగులపై విచక్షణారహితంగా దాడి చేశారు. వదిలేయాలంటూ ఓ మహిళ.. వేడుకుంటున్నా లెక్కచేయకుండా కొట్టారు.

బంద్‌లో భాగంగా కుప్పంలో వైసీపీ నేతలు.. బలవంతంగా దుకాణాలు మూసేయించారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 300 ఆర్టీసీ బస్సుల్ని.. డిపోలకే పరిమితం చేశారు. బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. బంద్ వలన విద్యార్థులు బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అష్ట కష్టాలు పడి ఏదో ఒక వాహనంలో కళాశాల చేరుకుంటే 10 గంటలకు ఈరోజు సెలవు అని తెలిసి నిరాశతో వెనుతిరిగారు.

మరోవైపు పూతలపట్టులో చంద్రబాబు పర్యటన సందర్భంగా కట్టిన తెలుగుదేశం బ్యానర్లను వైసీపీ నాయకులు చించేయడం.. ఉద్రిక్తతకు దారితీసింది. టీడీపీ శ్రేణులు రోడ్డుపై నిరసనకు దిగగా.. వైసీపీ నాయకులూ పోటీకి కూర్చున్నారు. డీపీ, వైసీపీ పోటాపోటీగా ధర్నా చేపట్టారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఆధ్వర్యంలో చంద్రబాబు దిష్టిబొమ్మను... దహనం చేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత తలెత్తింది. చిత్తూరు డీఎస్పీ శ్రీనివాస్ మూర్తి రంగంలోకి దిగి.. టీడీపీ వైసీపీ శ్రేణులను చెదరగొట్టారు. చంద్రబాబుకు దమ్ముంటే పూతలపట్టు రావాలంటూ MS బాబు సవాల్ విసిరారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.