బీజేపీ కిసాన్ మోర్చా ఆందోళనలో తోపులాట - గుంటూరులో ఉద్రిక్తత - ఏపీలో కరవు న్యూస్

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 28, 2023, 2:51 PM IST

Tension in BJP Kisan Morcha Protest: రాష్ట్రంలోని 403 మండలాలను కరవు మండలాలుగా ప్రకటించాలని బీజేపీ కిసాన్‌ మోర్చా చేపట్టిన ఆందోళన ఉద్ధృతంగా మారింది. రైతుల సమస్యల్ని(Farmers Facing Problems in AP) పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. బీజేపీ శ్రేణులు గుంటూరులోని వ్యవసాయశాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించాయి. రాష్ట్ర వ్యాప్తంగా నేతలు తరలివస్తారనే సమాచారంతో జిల్లాల్లో ఎక్కడికక్కడ నేతల్ని పోలీసులు గృహ నిర్భందం చేశారు. కమిషనర్ కార్యాలయం వద్దకు వస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ.. మరికొందరికి నోటీసులిచ్చారు.

BJP Kisan Morcha Protest Guntur: గుంటూరులో వందలాది మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. చుట్టుగుంట కూడలితో పాటు కమిషనర్ కార్యాలయం నాలుగు గేట్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆందోళనకారులు ఒక్కసారిగా దూసుకురావటంతో పోలీసులు గేట్లకు తాళాలు వేశారు. దీంతో నాయకులు గేటు ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్ధృతంగా మారడంతో పోలీసులు ఆందోళనకారుల్ని అరెస్టు చేశారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.