ఉద్యోగ నోటిఫికేషన్లు 'ఖాళీ విస్తర - మంచినీళ్ల' చందం - తెలుగు యువత వినూత్న నిరసన - Guntur news

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 9, 2023, 1:47 PM IST

Telugu Youth Protest Against YSRCP Government : ఏటా జాబ్ క్యాలెండర్ (Job Calendar) అంటూ.. నిరుద్యోగులను సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) మోసగిస్తున్నారంటూ తెలుగు యువత వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతను మోసం చేస్తుందని తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు రావిపాటి సాయి కృష్ణ (Ravipati Sai Krishna) మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉద్యోగాల పేరుతో ప్రకటిస్తున్న నోటిఫికేషన్లు నిరుద్యోగ యువతకు ఉత్తి విస్తర మంచినీళ్ల చందంగా ఉందని ఆయన అసహనం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా ఉపాధి కార్యాలయం వద్ద తెలుగు యువత నిరసన తెలిపారు. నాలుగున్నర సంవత్సరాల కాలంలో ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుద్యోగులను తీవ్రంగా మోసం చేసిందని ఆరోపించారు. ఎన్నికల సమీపిస్తున్న వేళ మరోమారు గ్రూప్-2 ఉద్యోగాలు భర్తీ చేస్తామని నోటిఫికేషన్ జారీ చేయటం సిగ్గు చేటని అన్నారు. 

YSRCP Government Careless on Job Calendar : అధికారంలోకి రాక ముందు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్న సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇంత వరకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని రావిపాటి సాయి కృష్ణ పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నోటిఫికేషన్ గారడీలను మానుకోవాలని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. నిరసన చేస్తున్న తెలుగు యువత నాయకులను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.