Telugu Rythu State President Fire on CM Jagan: 'ఈనెల 25లోగా డిమాండ్లు పరిష్కరించాలి.. లేదంటే ఉద్యమం ఉద్ధృతం' - Marreddy Srinivasa Reddy news

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 19, 2023, 9:09 PM IST

Telugu Rythu State President Fire on CM Jagan: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగు రైతు అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కరవు విలయతాండవం చేస్తుంటే.. దానిని నివారణకు చర్యలు తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి జగన్.. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కరవు కారణంగా నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఈ నెల 25 నుంచి ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.      

Marreddy Srinivasa Reddy comments: ''ఈ నెల 25లోగా రైతుల డిమాండ్లను పరిష్కరించాలి. డిమాండ్లను పరిష్కరించకపోతే ఉద్యమం ఉద్ధృతం చేస్తాం. రాష్ట్రంలో కరవు విలయతాండవం చేస్తోంది. కరవు వేళ సీఎం జగన్ ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయించే పనిలో ఉన్నారు. నష్టపోయిన రైతులకు అధికారులు భరోసా ఇవ్వటం లేదు. పంటలు పెట్టుకుని కష్టపడ్డ, నష్టపడ్డ రైతులకు డబ్బులిచ్చిన దాఖలాలు లేవు. పొట్ట దశలో ఉన్న వరి ధాన్యానికి వర్షం అవసరం. పంట నష్టపరిహారం ఇచ్చి మరో పంట వేసుకోవడానికి ప్రభుత్వం సహకరించడం లేదు. పంటలు పండని ప్రాంతాల్లో మిరప తదితర పంటలు వేసినట్లు దొంగ రికార్డులు సృష్టించినవారికి డబ్బులిస్తున్నారు. ఇప్పటికైనా సీఎం జగన్, అధికారులు మేల్కొని రైతులను ఆదుకోవాలి. లేదంటే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తాం'' అని తెలుగు రైతు అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.