CBN Meeting With Minorties: ముస్లింలకు విరుద్ధంగా టీడీపీ నిర్ణయం ఉండదు: చంద్రబాబు - Minority religious leaders fire on CM Jagan
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/19-07-2023/640-480-19042135-58-19042135-1689776743526.jpg)
CBN Meeting With Minorties: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముస్లింలకు విరుద్ధంగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం ఉండబోదని.. ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముస్లిం మత గురువులకు భరోనిచ్చారు. ముస్లింల హక్కులు, మనోభావాలను కాపాడేందుకు తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంటుందని తెలిపారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ముస్లిం మత పెద్దలు, మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి నేతలతో చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. సమావేశంలో.. జగన్ ప్రభుత్వంలో మైనార్టీలు ఎదుర్కొంటున్న సమస్యలను చంద్రబాబుకు వివరించారు. అనంతరం యూసీసీ బిల్లుపై ఆయనతో చర్చించారు. సమావేశం అనంతరం శాసనమండలి మాజీ ఛైర్మన్ షరీఫ్ మీడియాతో మాట్లాడుతూ..''ముస్లింల హక్కులు, మనోభావాలను కాపాడేందుకు తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. యూసీసీ చట్టం దేశ సంస్కృతికి విరుద్ధం. పార్లమెంట్‌లో యూసీసీ బిల్లును వ్యతిరేకించాలని ఆయనను కోరాము. రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డిని నమ్మే పరిస్థితిలో మైనార్టీలు లేరు. ఎందుకంటే గత నాలుగేళ్లలో ముస్లిం మైనార్టీలపై జరిగిన ఏ దాడి పట్ల జగన్ స్పందించలేదు, చర్యలు తీసుకోలేదు. రాజకీయ అవసరాల కోసం ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడుకున్నారు. కానీ, చంద్రబాబు నాయుడు మైనార్టీల మతపరమైన విశ్వాసాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు'' అని అన్నారు.