Cid Pettion On Cbn house: చంద్రబాబు ఇంటి జప్తునకు అనుమతి కోరిన ఏపీ సీఐడీ

🎬 Watch Now: Feature Video

thumbnail

Cid Pettion On tdp cheif Chandrababu Karakatta road House updates: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని కరకట్ట రోడ్డు సమీపంలో నివసిస్తున్న ఇంటిని జప్తు (ఎటాచ్‌) చేసేందుకు ఈ నెల 12వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తూ.. సీఐడీకి ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు చంద్రబాబు ఇంటి జప్తునకు (ఎటాచ్‌) అనుమతి ఇవ్వాలంటూ తాజాగా ఏపీ సీఐడీ.. విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ చేసింది. ఆ పిటిషన్‌పై నేడు ఏసీబీ కోర్టు వాదనలు విననుంది.

వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని కరకట్ట రోడ్డు సమీపంలో ఉన్న లింగమనేని రమేష్‌కు చెందిన ఇంట్లో కొన్నేళ్లుగా చంద్రబాబు నాయుడు అద్దెకు ఉంటున్నారు. ఈ క్రమంలో రాజధాని అమరావతి నగర బృహత్‌ ప్రణాళిక డిజైనింగ్‌, ఇన్నర్‌ రింగ్‌రోడ్డు ఎలైన్‌మెంట్‌, కంతేరు, కాజ, నంబూరు గ్రామాల ప్రాంతీయాభివృద్ధి ప్రణాళికల ద్వారా లింగమనేని ఆస్తులు, భూముల విలువ పెరగడానికి చంద్రబాబు దోహదపడ్డారని, తద్వారా వారికి అనుచిత లబ్ధి కలిగించారని సీఐడీ అభియోగం మోపింది. అంతేకాకుండా, లంచం/క్విడ్‌ ప్రోకో కింద చంద్రబాబుకు లింగమనేని రమేష్‌ తన ఇంటిని ఉచితంగా ఇచ్చేశారంటూ సీఐడీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఆ ఇంటిని జప్తు చేసేందుకు సీఐడీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తున్నట్లు తెలియజేస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో ఇంటి జప్తునకు (ఎటాచ్‌) అనుమతిని కోరుతూ సీఐడీ విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖాలాలు చేసింది. 

మరోవైపు సీఐడీ పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ కోర్టులో మంగళవారం రోజు విచారణ జరిగింది. విచారణలో భాగంగా ప్రత్యేక పీపీ వైఎన్‌ వివేకానంద వాదనలు వినిపించారు. ఎటాచ్‌మెంట్‌కు సంబంధించి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడానికి ముందు ప్రతివాదులకు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. చట్ట నిబంధనల పరిశీలన, తదుపరి వాదనలు వినేందుకు విచారణను బుధవారానికి వాయిదా వేస్తూ.. న్యాయాధికారి ఉత్తర్వులు జారీ చేశారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.