CPS: సీపీఎస్​ రద్దు.. ప్రభుత్వం స్పందించకుంటే మరో చలో విజయవాడ : ఎఫ్​ఏపీటీవో - బ్రేకింగ్ న్యూస్ లైవ్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 8, 2023, 5:42 PM IST

Techers Union Leaders On CPS : సీపీఎస్​ రద్దు చేయమని ప్రభుత్వాన్ని కోరితే.. జీపీఎస్​ను తీసుకురావటం ఏంటని ఆంధ్రప్రదేశ్​ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీపీఎస్​లోకి వెళ్లటానికి ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఆప్షన్​ ఇస్తే ఎవరు వెళ్లవద్దని కోరారు. సీపీఎస్​, జీపీఎస్​ రెండు ఒక్కటేనని.. జీపీఎస్​ అనేది కొత్త సీసాలోనున్న పాత సారానే అని అన్నారు. సీపీఎస్​ను మిగిలిన రాష్ట్రాల్లో రద్దు చేసినప్పుడు ఏపీలో ఎందుకు రద్దు చేయలేకపోతున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం స్పందించకపోతే మరో చలో విజయవాడ చేపట్టేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పాత పెన్షన్​ పునరుద్ధరణ తప్ప మేము దేనికి అంగీకరించేది లేదని స్పష్టం చేశారు.  రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎఫ్​ఏపీటీవో దశలవారిగా ఉద్యమాలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా గురువారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు తమ సమస్యలను వివరిస్తూ అన్ని జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేశారు. ఆంధ్రప్రదేశ్​ ఉపాధ్యా సంఘాల సమాఖ్య నాయకులతో మా ప్రతినిధి శ్రీనివాస్​ ముఖాముఖి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.