TDP Varla Ramaiah on Assaults on Dalits: 'దళితులపై దాడుల అంశంలో సీఎం జగన్పై అనుమానంగా ఉంది' - విజయవాడ లేటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video
TDP Varla Ramaiah on Assaults on Dalits: వైసీపీ ప్రభుత్వంలో దళితులకు రక్షణ కరవైందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. రాష్ట్రంలో దళితులపై దాడులు విపరీతంగా పెరిగాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులను చంపినా, నరికినా, శిరోముండనం చేసినా, అత్యాచారాలు చేస్తున్నా.. ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డికి చీమ కుట్టినట్లు కూడా లేదని మండిపడ్డారు. దళితులపై దాడుల అంశంలో ప్రభుత్వ వైఖరిపై అనుమానం వ్యక్తం చేసిన ఆయన.. దాడులకు తెగబడినవారిని ఈ ప్రభుత్వమేమైనా ప్రోత్సహిస్తోందా..?అని ప్రశ్నించారు.
"వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితులకు రక్షణ కరవైంది. రాష్ట్రంలో దళితులపై దాడులు విపరీతంగా పెరిగాయి. దళితులను చంపినా, నరకినా, శిరోముండనం చేసినా.. ఆఖరికి అత్యాచారాలకు పాల్పడినా.. ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా కూడా వ్యవహరించట్లేదు. జగన్ సర్కార్ వైఖరి చూస్తుంటే.. దళితులపై దాడి అంశంలో పరోక్షంగా ప్రోత్సహిస్తోందన్న అనుమానం వస్తోంది." - వర్ల రామయ్య, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు