TDP MP Rammohan Naidu Fires on YCP: 'వైసీపీ కక్షసాధింపు చర్యల వల్ల రాష్ట్రంలో చీకటి రోజులు.. పార్లమెంట్‌లోనూ పోరాటం కొనసాగిస్తాం' - టీడీపీ రామ్మోహన్
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 17, 2023, 4:03 PM IST
TDP MP Rammohan Naidu Fires on YCP: వైసీపీ కక్షసాధింపు చర్యల వల్ల రాష్ట్రంలో చీకటి రోజులు కొనసాగుతున్నాయని టీడీపీ ఎంపీ కె.రామ్మోహన్ మండిపడ్డారు. చంద్రబాబుకు జరిగిన అన్యాయాన్ని అఖిలపక్ష భేటీలోనూ లేవనెత్తుతామని.. పార్లమెంటులోనూ తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ చర్యలతో టీడీపీ మరింత బలపడిందని తెలిపారు. కేసు నిలబడదని తెలిసీ.. ఉద్దేశ పూర్వకంగా అరెస్టు చేయించి పైశాచిక ఆనందం పొందారని ఎంపీ మండిపడ్డారు. సైకో సీఎం జగన్ మోహన్ రెడ్డి.. తాను చంద్రబాబును అరెస్టు చేయించానని చెప్పుకొనేందుకు తెగించాడు తప్ప.. కేసులో ఎక్కడా న్యాయం, ధర్మం పాటించలేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఐడీ పోలీసులకు అంత ఆత్రుత ఎందుకో అర్థం కావడం లేదు.. ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగం (Constitution) పని చేయడం లేదు అని ఎంపీ రామ్మోహన్ తెలిపారు. చంద్రబాబు రిమాండ్ (Chandrababu remand)లో ఉన్నా.. పార్టీ నిబద్ధతకు కట్టుబడి ఉన్నామన్న రామ్మోహన్ నాయుడు.. చంద్రబాబును అక్రమంగా రిమాండ్‌లో ఉంచినా పార్లమెంటరీ పార్టీ నేతల సమావేశం నిర్వహించామని చెప్పారు. వైసీపీ నేతలు మాత్రం పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించలేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ హైదరాబాద్‌లోనూ స్వచ్ఛందంగా నిరసన తెలిపారని చెప్పారు. ప్రభుత్వ చర్యలతో టీడీపీ మరింత బలపడిందని, చంద్రబాబుపై ప్రజల్లో నమ్మకం మరింత పెరిగిందని చెప్పారు.