ముడుపులు తీసుకోకుండానే టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమించారా? : లోకేశ్ - బూదాటి లక్ష్మీనారాయణను టీటీడీ బోర్డు సభ్యునిగా
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 29, 2023, 12:30 PM IST
TDP Lokesh On Bhudati Laxminarayana: పొరుగు రాష్ట్రాల్లో అక్రమాలకు పాల్పడ్డారని అరెస్ట్ చేసిన బూదాటి లక్ష్మీనారాయణకు.. వైసీపీ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడి పదవి ఎలా వచ్చిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిలదీశారు. ముడుపులు అందుకోకుండానే బూదాటి లక్ష్మీనారాయణను టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమించారా అని లోకేశ్ ప్రశ్నించారు. కరకట్ట కమాల్.. ఇక డ్రామాలు కట్టిపెట్టాలంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. అక్రమార్కులకు వైసీపీ ప్రభుత్వం పదవులు అంటకడుతోందని ఆయన విమర్శించారు.
బూదాటి లక్ష్మీనారాయణ పలు ప్రీలాంచ్ ప్రాజెక్టుల పేరుతో గతంలో.. 2 వేల 500 మంది నుంచి 900 కోట్ల రూపాయలు వసూలు చేశారని ఆరోపణలున్నాయి. ఈ ప్రాజెక్టుల పేరుతో అందరినీ మోసం చేశారని ఆర్థిక నేరాల విభాగం అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనను హైదరాబాద్లో సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలోనే టీటీడీ పాలకమండలి సభ్యత్వానికి ఆయన రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.