TDP Leaders House Arrest in Hindupur జగనాసుర వధ నిరసనకు వెళ్లనీయకుండా.. టీడీపీ నేతల గృహ నిర్బంధం! పోలీసులు తీరుపై మండిపాటు - AP Latest News
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 23, 2023, 9:20 PM IST
TDP Leaders Under House Arrest in Hindupur: టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా దేశం చేస్తోంది రావణాసుర దహనం- మనం చేద్దాం జగనాసుర దహనం అంటూ.. తెలుగుదేశం నిరసన తెలిపింది. రాత్రి తెలుగుదేశం నేతలు, చంద్రబాబు అభిమానులు వీధుల్లోకి వచ్చి సైకో పోవాలి అని రాసి ఉన్న పత్రాలను దహనం చేశారు. ఈ నేపథ్యంలో శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలో తెలుగుదేశం పార్టీ నాయకులను ఈ కార్యక్రమం నిర్వహించకుండా పోలీసులు గృహ నిర్బంధం చేశారు. హిందూపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద తలపెట్టిన జగనాసుర వధ కార్యక్రమానికి వెళ్లకూడదంటూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొల్లకుంట అంజనప్ప పట్టణ అధ్యక్షుడు డి రమేష్ కుమార్లను వన్ టౌన్ పోలీసులు గృహనిర్బంధం చేశారు. రాష్ట్రంలో ఎక్కడ లేనిది హిందూపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఇలా గృహ నిర్బంధాలు చేయడం ఏంటని నాయకులు వన్ టౌన్ సీఐ శ్రీనివాసులు మరియు పోలీసుల తీరుపై మండిపడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.