TDP Leaders Serious Allegations on CM Jagan: 'ఢీ అంటే ఢీ.. దేనికైనా రెడీ'.. సీఎం జగన్‌పై టీడీపీ నిప్పులు
🎬 Watch Now: Feature Video
TDP Leaders Serious Allegations on CM Jagan: సీఎం జగన్‌పై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న తీవ్ర ఆరోపణలు చేశారు. కుట్రలో భాగంగానే నిన్న ముఖ్యమంత్రి జగన్.. దేవినేని అవినాష్ ఇంటికి వెళ్లారని ఆరోపించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో లోకేశ్ పాదయాత్ర, గన్నవరంలో బహిరంగ సభను ఆటంకపరచాలని కుట్ర జరుగుతుందని, అందులో భాగంగానే ఇరువురి భేటీ జరిగిందని పేర్కొన్నారు. ఎప్పుడో ప్రారంభించిన హయత్ హోటల్‌ను సీఎం మరోసారి ప్రారంభించటమేంటని బుద్దా ప్రశ్నించారు. ఎవరైనా లోకేశ్ పాదయాత్రను అడ్డుకోవాలని చూసినా, ఇబ్బందులు కలిగించాలని ప్రయత్నించినా దీటుగా జవాబు ఇస్తామని హెచ్చరించారు. దేవినేని అవినాష్ (Deviveni Avinash) బలి పశువు కావడం, విజయవాడ సిటీలో వైసీపీ మట్టి కొట్టుకుపోవడం ఖాయమని అన్నారు. యార్లగడ్డను జగన్ వాడుకొని వదిలేసాడన్న బుద్దా వెంకన్న... నోరేసుకుపడే వైసీపీ నేతలు కూడా బలి పశువులు కావడం ఖాయమని తెలిపారు. యార్లగడ్డ వెంకట్రావు (Yarlagadda Venkatrao) రాకను స్వాగతిస్తున్నామన్న బద్దా.. ఆయన అపాయింట్మెంట్ విషయం అధిష్ఠానం చూసుకుంటుందని స్పష్టం చేశారు. యార్లగడ్డ రాకతో తెలుగుదేశం పార్టీ బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
విజయవాడలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) యువగళం పాదయాత్ర సందర్భంగా ప్రకాశం బ్యారేజీ స్వాగత ఫ్లెక్సీ లతో నిండిపోయింది. పాదయాత్ర సాగే మార్గం మొత్తం భారీ ఫ్లెక్సీలు, స్వాగత ద్వారాలను పార్టీ సీనియర్ నేత కేశినేని చిన్ని(శివనాథ్)(Kesineni Chinni) ఏర్పాటు చేశారు. స్వాగత ఏర్పాట్లను కేశినేని చిన్ని, బుద్దా వెంకన్న, ఇతర నేతలు పరిశీలించారు. యార్లగడ్డను పార్టీలో చేర్చుకునే అంశం పార్టీ అధినాయకత్వమే చూసుకుంటుందని స్పష్టం చేశారు. యార్లగడ్డ విషయంలో చంద్రబాబు (Chandrababu) ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తమకు సమ్మతమేనని స్పష్టం చేశారు. యార్లగడ్డను వైసీపీ వాడుకుని వదిలేసిందని విమర్శించారు. బెజవాడలోని వైసీపీ మూడు సీట్లను ప్రకటించడానికి సజ్జల(Sajjala) ఎవరని మండిపడ్డారు. మూడు సీట్లల్లోనూ వైసీపీ మట్టి కరవడం ఖాయమని నేతలు స్పష్టం చేశారు.
Nara Lokesh Padayatra in Mangalagiri from Today: మంగళగిరికి చేరిన లోకేశ్ యువగళం పాదయాత్ర
Nara Lokesh Reveals Love Story with Brahmani: బ్రాహ్మణితో నాది లవ్ ఎట్ ఫస్ట్ సైట్: లోకేశ్