TDP Leaders Protest నెల్లూరు సర్వేపల్లిలో రూ .600 కోట్ల విలువైన మట్టిని అమ్మేశారు.. !: టీడీపీ నేతల ఆందోళన - అక్రమ గ్రావెల్ మైనింగ్‌పై టీడీపీ నాయకుల ఆందోళన
🎬 Watch Now: Feature Video
TDP Leaders Protest on YCP Gravel Mining Mafia: చెరువుల్లో గ్రావెల్ తవ్వకాలపై నెల్లూరు ఇరిగేషన్ కార్యాలయంలో టీడీపీ నాయకులు నిరసన చేపట్టారు. నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గంలో వైసీపీ నేతలు అడ్డగోలుగా.. చెరువుల్లో గ్రావెల్ తవ్వకాలు చేసి భారీ వ్యాపారం చేస్తున్నారని టీడీపీ నాయకులు ఆరోపించారు. గ్రావెల్ మాఫియాపై నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్నామని టీడీపీ నేతలు తెలిపారు. వైసీపీ నేతలు పది లక్షల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ తవ్వకాలు చేశారని టీడీపీ నేతలు పేర్కొన్నారు. ఇలా 600కోట్ల రూపాయల వ్యాపారం జరిగందని ఆరోపించారు. వైసీపీ నేతల అక్రమ గ్రావెల్ మైనింగ్ మాఫియాపై విమర్శలు చేస్తూ.. ఇరిగేషన్ కార్యాలయం వద్ద టీడీపీ నేతలు బైఠాయించారు. ఈ క్రమంలో గ్రావెల్ తవ్వకాలపై సంబంధించిన వివరాలు ఇవ్వాలని టీడీపీ నేతలు అధికారులను కోరారు. వివరాలను ఇస్తామన్న అధికారులు కార్యాలయానికి రాలేదు. దీంతో అధికారుల తీరుపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.