TDP Leaders Protest Against CBN Arrest in AP: చంద్రబాబుకు మద్దతుగా ఊరూ వాడా... అన్ని జిల్లాల్లో కొనసాగుతున్న నిరసనలు - Ravulapalem latest news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03-10-2023/640-480-19671733-thumbnail-16x9-tdp--leaders--protest--against-cbn-arrest-in-ap.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 3, 2023, 6:56 PM IST
TDP Leaders Protest Against CBN Arrest in AP: తెలుగుదేశం అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ పార్టీ శ్రేణులు చేపట్టిన నిరసనలు కొనసాగుతున్నయి. కోనసీమ జిల్లా వ్యాప్తంగా 21వ రోజు నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. రావులపాలెంలో మహిషాసుర మర్ధిని, రాక్షసుడు వేషధారణలో అమ్మవారు రాక్షస సంహరణ నాటకాన్ని ప్రదర్శించారు. గుంటూరు జిల్లా పొన్నూరు, తాడికొండలో జరిగిన దీక్షకు భారీ సంఖ్యలో మహిళలు సంఘీభావం తెలిపారు. పల్నాడు జిల్లా నాదెండ్ల నందికుంట విఘ్నేశ్వరస్వామికి పెద్దసంఖ్యలో మహిళలు, నాయకులు 108 కలశాలతో అభిషేక పూజలు నిర్వహించారు.
బాపట్ల జిల్లా పర్చూరులో తిక్కరాజుపాలెంకు చెందిన 98 ఏళ్ల వృద్ధురాలుతో సహా మహిళలు హనుమాన్ చాలీసా పారాయణం చదివారు. శాంతియుత నిరసన నిరసనలు తెలుపుతున్న తమపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తీవ్ర ఒత్తిడితో పోలీసుల వేధింపులు ఎక్కువయ్యాయని ఈ సాంప్రదాయం సరైన విధానం కాదని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ జయంతి నాడు తిరుపతిలో చేపట్టిన ఆమరణ నిరాహరదీక్షను పోలీసులు భగ్నం చేయడంపై టీడీపీ జిల్లా అధ్యక్షుడు నరసింహ యాదవ్ మండిపడ్డారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో నోటికి నల్లటి రిబ్బన్లు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. కృష్ణా, ఎన్టీఆర్, అన్నమయ్య జిల్లాల్లో నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి.