TDP Leaders Dharna Against Illegal Mining రహదారి పేరు చెప్పి మట్టిని అక్రమంగా తవ్వుతున్న వైసీపీ నేతలు.. అడ్డుకున్న టీడీపీ నేతలు - Guntur District latest News
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 7, 2023, 5:46 PM IST
TDP Leaders Dharna Against Illegal Mining in Mangalagiri : గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ వద్ద అక్రమ క్వారీని నిర్వహిస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు ధర్నా నిర్వహించారు. స్థానిక శాసన సభ్యులు ఆళ్ల రామకృష్ణా రెడ్డి అండతోనే కొంతమంది వ్యక్తులు ప్రభుత్వ స్థలంలో మట్టిని అక్రమంగా తవ్వేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపించారు. ఎక్కడ నిర్మించని రహదారి పేరుతో సుమారు వెయ్యి లారీల గ్రావెల్ ఎమ్మెల్యే అనుచరులు అమ్ముకున్నారని చెప్పారు. మంగళగిరి నియోజకవర్గంలో అవినీతికి తావు లేదని ప్రకటించిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డికి అక్రమంగా నిర్వహిస్తున్న క్వారీ కనిపించలేదా అని టీడీపీ నేతలు (TDP Leaders Questions to Mangalagiri MLA RK) ప్రశ్నించారు. ఎయిమ్స్ రహదారికి అనుకొని ప్రభుత్వ స్థలంలో అక్రమంగా గ్రావెల్ తవుతున్నారని అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చిన వారు పట్టించుకోవడం లేదని, అది అటవీ శాఖకు సంబంధం లేదనే సమాధానం ఇచ్చారని అన్నారు. దీంతో అటవీ శాఖ అధికారులపై తెలుగుదేశం పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.