TDP Leaders Agitation at MRO Office: పంచాయతీ వార్డు మెంబరు నామినేషన్లలో అవకతవకలు.. టీడీపీ నేతల ఆందోళన - ap news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 11, 2023, 5:45 PM IST

TDP Leaders Agitation at MRO Office : శ్రీ సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం నేమద్దెల పంచాయతీ వార్డు మెంబరు నామినేషన్లలో అధికారులు అవకతవకలకు పాల్పడుతున్నారని టీడీపీ నాయకులు ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. అధికార పార్టీ అభ్యర్థి నామినేషన్‌ని సులభతరం చేసేందుకు టీడీపీ అభ్యర్థి పవన్‌ కుమార్‌ నామినేషన్‌ నుంచి కీలక పత్రాలను తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ ఒత్తిళ్లతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. దీనిపై ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని టీడీపీ అభ్యర్థి పవన్‌ కుమార్‌ కోరారు. 

"చెన్నేకొత్తపల్లి మండలం నేమద్దెల పంచాయతీ 6వ వార్డు మెంబరుకి నిన్న నామినేషన్ వేశాను. అన్ని పత్రాలు ఇచ్చాము. అధికారులు అన్ని చెక్​ చేసుకుని సరిపోయాయని మాకు ఒక ఫామ్ ఇచ్చారు. ఈరోజు ఒక కీలక పత్రం లేదని చెబుతున్నారు. నిన్న ఉన్న పత్రాలు ఈరోజు లేవని ఎలా అంటారు. అది మాకు సంబంధం లేదు.. మీరే చూసుకోవాలని చెబుతున్నారు. రాజకీయ నాయకుల ఒత్తిడి ఉండటంతో ఇలా చేస్తున్నారు. మేము ఎన్నికల కమిషనర్ దగ్గరికి వెళుతున్నాము. మాకు ఆయనే న్యాయం చేయాలని కోరుతున్నాము."- పవన్‌ కుమార్‌, టీడీపీ అభ్యర్థి

For All Latest Updates

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.