వివాహాలకు హాజరు కావడం - ప్రారంభమైన పనులను మళ్లీ ప్రారంభించడం తప్పా! సీఎం పర్యటనతో కడపకు ఒరిగేందేమి లేదు - సీఎం జగన్ కడప పర్యటనపై టీడీపీ నేతల వ్యాఖ్యలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 11, 2023, 4:39 PM IST
TDP Leader Srinivas Reddy on CM Jagan Kadapa Tour: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో రెండు రోజుల పాటు పర్యటన చేసినా జిల్లాకు ఒరిగేందేమి లేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. వివాహాలకు హాజరు కావడం.. ప్రారంభించిన పనులను మళ్లీ ప్రారంభించడం తప్పితే.. జిల్లాలో కరవుపై ఎలాంటి సమీక్ష చేయలేదని మండిపడ్డారు. జిల్లాలో కరవు విలయతాండవం చేస్తుంటే.. కనీసం పంట పొలాలను కూడా సీఎం పరిశీలించలేదని ఆయన వ్యాఖ్యానించారు. జిల్లాలో ఒక్క అభివృద్ధి పని కూడా పూర్తి కాలేదన్న శ్రీనివాస్‌రెడ్డి.. స్టీల్ ప్లాంట్‌కు రెండుసార్లు శంకుస్థాపన చేసినా అడుగు కూడా ముందుకు కదల్లేదని తెలిపారు.
అనంతపురం జిల్లా పర్యటనకు వెళ్లిన సమయంలో కొంత కరవు మాత్రమే ఉందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం చూస్తే.. అసలు రైతులపై ఈ ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ ఏ పాటిదో అర్థమవుతోందన్నారు. జిల్లాలో కరవు పరిస్థితులపై దీపావళి తర్వాత క్షేత్రస్థాయిలో టీడీపీ-జనసేన సంయుక్తంగా పరిశీలిస్తాయని శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.