TDP Leader Nakka Anandbabu Fires on CM Jagan దళిత హంతకుడు అనంతబాబుతో సీఎం జగన్‌రెడ్డి భేటీలా?: టీడీపీ నేత నక్కా ఆనంద్ - అనంతబాబు సస్పెన్షన్ వివాదం
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 29, 2023, 8:08 PM IST
TDP Leader Nakka Anandbabu Fires on CM Jagan: దళితుడ్ని దారుణంగా హత్య చేసిన వారితో సీటు, స్వీట్లు పంచుకోవడం.. జగన్ దళిత వ్యతిరేక మనస్తత్వానికి నిదర్శనమని టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు మండిపడ్డారు. జగన్ రెడ్డికి దళితులంటే గిట్టదనే విషయం అనంతబాబు వ్యవహరంతోనే తేలిపోయిందని అన్నారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేశామని ప్రకటించిన జగన్.. అతనితో వేదిక ఎలా పంచుకున్నారని ప్రశ్నించారు. దళితుల్ని వంచించడానికే జగన్ రెడ్డి తన పార్టీ తరఫున.. అనంతబాబు సస్పెన్షన్ అంటూ ఉత్తుత్తి ప్రకటనలు చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతబాబు గంజాయి సాగు, రంగురాళ్ల వ్యాపారంతో నెలనెలా.. కప్పం కడుతున్నాడు కాబట్టే జగన్ అక్కున చేర్చుకుంటున్నారని విమర్శించారు. తన ఎస్సీలు అంటూ గుండెలు బాదుకుంటూ.. గొంతు చించుకునే సీఎం అనంతబాబుపై ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి దళితజాతి వినాశనమే లక్ష్యంగా వ్యవహరిస్తుంటే.. వైసీపీ దళిత నేతలు, దళిత మంత్రులు ఎందుకు నోరెత్తటం లేదని ప్రశ్నించారు. జగన్‌కి దళితులంటే ఏమాత్రం అభిమానం ఉన్న.. అనంతబాబు తక్షణమే పార్టీ నుంచి ప్రభుత్వం నుంచి తొలగించాలని అన్నారు.