సీఎం జగన్ అబద్దాల వల్లే రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రం దేశంలోనే ముందుంది : పట్టాభిరామ్ - జగన్ పై కొమ్మారెడ్డి పట్టాభిరామ్ వ్యాఖ్యలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 8, 2023, 12:00 PM IST
TDP Leader Kommareddy Pattabhiram Fire on CM Jagan : నాలుగున్నరేళ్లలో సీఎం జగన్ మోహన్ రెడ్డి హయాంలో 60 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, రైతులు 30 వేల కోట్ల రూపాయలు నష్టపోయారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. జగన్ మాత్రం రైతులకు చెల్లించిన పంటలబీమా సాయం సున్నా అని ఆయన ఆరోపించారు.
Farmers Crop Loss in AP Due to Michaung Cyclone : టీడీపీ అధినేత చంద్రబాబు పాలనలో ఎక్కువ క్లెయిమ్ రేషియో ఏపీలో ఉండేదని, జగన్ చర్యలతో నెంబర్ వన్ స్థానం నుంచి అట్టడుగుకు పడిపోయామని పట్టాభి ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటల బీమా కింద ఎంత చెల్లించారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తుపానును ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని దుయ్యబట్టారు. వాతావరణ శాఖ హెచ్చరించినా జగన్ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సన్నద్ధత లేకనే పంటలు మునిగి రైతులు నష్టపోయారన్నారు. రైతు పక్షపాతినని చెబుతూనే జగన్ వారిని నిండా ముంచారని ఎద్దేవా చేశారు. జగన్ మోసాలు, అబద్ధాల వల్లే రాష్ట్రం రైతు ఆత్మహత్యల్లో దేశంలో ముందుందని పట్టాభిరామ్ విమర్శించారు.