Tdp Innovative Protest అధ్వానంగా రోడ్డు.. వినూత్నంగా టీడీపీ నిరసన - రోడ్డుపై నాట్లు వేసిన టీడీపీ
🎬 Watch Now: Feature Video
Tdp Innovative Protest In Yadamari: చిత్తూరు-యాదమరి ప్రధాన రహదారిలో ఉన్న గోతుల సమస్యపై టీడీపీ నాయకులు వినూత్న నిరసన చేపట్టారు. రోడ్లపై ఉన్న గుంతల్లో కాడెద్దులతో దుక్కి, దున్ని వరి నాట్లు వేసి ఆ దారి దుస్థితి పై మండిపడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారైందని టీడీపీ నేతలు ఆరోపించారు. గుంతలమయమైన ఈ రోడ్డుపై ప్రయాణం సాగించాలంటే జనం భయపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా మాట్లాడిన పూతలపట్టు టీడీపీ ఇన్ఛార్జ్ మురళీమోహన్.. గ్రామాల్లోకి వెళ్తే తనను చూసి తలుపులేసుకుంటున్నారని చెప్పే స్థానిక ఎమ్మెల్యే బాబు.. ప్రజల ఇబ్బందులను గురించి పట్టించుకోకపోవడం వల్లే తనకు ఆ పరిస్థితి వచ్చిందని ఆయన గుర్తించాలి అని అన్నారు. రోడ్లు ఇంత అధ్వానంగా ఉంటే అధికార పార్టీ నాయకులు, సంబంధిత శాఖాధికారులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఇది ఆరంభం మాత్రమేనని, రహదారిని వెంటనే బాగుచేయకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.