thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 28, 2023, 5:22 PM IST

ETV Bharat / Videos

TDP Gorantla on Jagan : సీజేఐని కించపరిచిన చరిత్ర వైసీపీది.. తన మాటలకు కట్టుబడి ఉన్నాను! తప్పుడు కేసులకు భయపడేది లేదు : గోరంట్ల

TDP Gorantla on Jagan : తాను చట్టబద్ధంగానే మాట్లాడానని, ఏ న్యాయమూర్తినీ కించపరచలేదని తెలుగు దేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు. జగన్ వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నాడు అని తాను అన్న మాట్లల్లో ఎలాంటి తప్పు లేదన్న ఆయన... ఆ మాటలకు కట్టుబడి ఉన్నానని తెలిపారు. బెయిల్ పై జగన్ 10ఏళ్లు ఎలా బయట ఉన్నాడు..? వ్యవస్థల్ని మేనేజ్ చేయకుండానే ఇది సాధ్యమా అని నిలదీశారు. నోటీసులు వచ్చాక వాటిని పరిశీలించి అప్పుడు మాట్లాడతానని గోరంట్ల తెలిపారు.

వైసీపీ నేతలది తాత్కాలిక ఆనందమే.. సీజేఐని సైతం కించపరిచిన చరిత్ర వైసీపీ నేతలది అంటూ మండిపడ్డారు. సీజేఐని కించపరిచిన కేసులో ఎంతమంది వైసీపీ నాయకులపై చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం పెట్టే నిలబడని తప్పుడు కేసులకు భయపడేది లేదని తేల్చిచెప్పారు. నియంతలు, ప్రజలకు మధ్య జరిగే పోరాటంలో విజయం ప్రజలదేనని పేర్కొన్నారు. చంద్రబాబుని జైల్లో పెట్టి వైసీపీ పొందేది తాత్కాలిక ఆనందమేనన్నారు. ఎలాగూ ఓడిపోతున్నాం కాబట్టి తెలుగుదేశంపై బురదజల్లి పోవాలన్నది వైసీపీ యోచన అని గోరంట్ల బుచ్చయ్యచౌదరి విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.