TDP Fires on Lokesh Flexis Removed in Vijayawada: వైసీపీకి లేని రూల్స్ టీడీపీకే ఎందుకు..? లోకేశ్ ఫ్లెక్సీల తొలగింపుపై టీడీపీ ఆగ్రహం - ఫ్లెక్సీలు తొలగించిన విజయవాడ మున్సిపల్ అధికారులు
🎬 Watch Now: Feature Video

TDP Fires on Lokesh Flexis Removed in Vijayawada: టీడీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లను విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు తొలగించటం అన్యాయమని టీడీపీ ఫ్లోర్ లీడర్ ఎన్. బాలస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు స్వాగతం పలికేందుకు టీడీపీ శ్రేణులు విజయవాడలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేయగా.. వాటిని విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు తొలగించారు. వీటిని స్వచ్ఛ సర్వేక్షన్లో భాగంగా తొలగించగా.. నేడు నగరంలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా వైసీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మాత్రం అధికారులు ముట్టుకోలేదు. దీంతో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కార్యాలయం ఎదుట టీడీపీ నేతలు నిరసన తెలిపారు. వీఎంసీ కమిషనర్ వైసీపీ ఏజెంట్లా పని చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ పార్టీ ఫ్లెక్సీలు, జెండాలు, తొలగించిన అధికారులు.. వైసీపీ జెండాలు, బ్యానర్లను ఎందుకు తొలగించటం లేదని మండిపడ్డారు. స్వచ్ఛ సర్వేక్షన్ పేరుతో కేవలం టీడీపీ బ్యానర్లను మాత్రమే తొలగించడమేంటని దుయ్యబట్టారు. ఇకనుంచి టీడీపీ ఫ్లెక్సీలను తొలగిస్తే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు.