గుంతలు పూడ్చడానికి వెయ్యి కోట్లా..? జగన్ పోలవరం పర్యటన వెనుక కారణం అదే..!: దేవినేని ఉమ - about Polavaram Project Delay
🎬 Watch Now: Feature Video
Devineni Uma Fires On CM Jagan: పోలవరం సందర్శనకు వెళ్తే పోలీసులు అడ్డుకున్నారనీ, పోలవరం సందర్శన కోసం తమకు ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి, సెక్రటరీ, కలెక్టర్, అనుమతులు ఇవ్వాలని మాజీ మంత్రి దేవినేని ఉమా డిమాండ్ చేశారు. 81 కోట్లతో నిర్మించిని గైడ్ బండ్ కుంగితే చిన్నాచితక సమస్యలంటూ వ్యాఖ్యానించడాన్ని ఉమా తప్పుబట్టారు. వీటిపై ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పోలవరంలో గుంతలు పూడ్చడానికి వెయ్యి కోట్లు జగనార్పణం చేసుకున్నాడని మండిపడ్డాడు. పోలవరంలో పవర్ ప్రాజెక్ట్ కోసమే జగన్ డ్రామాలు ఆడినట్లు ఉమా తెలిపారు. గైడ్‌బండ్ కుంగడంపై సెంట్రల్ వాటర్ కమీషన్ వేసిన కమిటీ.. 16వ తేదీ లోపు విచారణ చేపట్టాలని చెప్పడంతో... జగన్ పోలవరం పర్యటన చేశాడని ఉమా విమర్శించాడు.
వైసీపీ ప్రభుత్వంలో దాదాపు తొమ్మిది సార్లు కరెంటు చార్జీలు పెంచారని దేవినేని ఉమా ధ్వజమెత్తారు. రాష్ట్రానికి కరెంటు ఇచ్చే విజయవాడ ధర్మల్ పవర్ స్టేషన్ ప్రాంతంలో కూడా అప్రకటిత విద్యుత్ కోతలు విధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చార్జీలు ఎంత కలుపుతున్నారో ఏ టైంలో కరెంటు బిల్లులు తీస్తున్నారో కూడా తెలియడం లేదని దుయ్యబట్టారు. ఆరు నెలల్లో జగన్ రెడ్డి ప్రభుత్వమే బంగాళాఖాతంలో కలుస్తాదని దేవినేని ఉమా హెచ్చరించారు.