Chandrababu released video: 'జగన్ ఎంత నటించినా.. క్రూరమైన వ్యక్తిత్వమే'.. చంద్రబాబు మరో వీడియో - తెలుగుదేశం
🎬 Watch Now: Feature Video
TDP leader Chandrababu released another video on YSRCP: "నాలుగేళ్ల నరకం" అంటూ రాష్ట్రంలో వైఎస్సార్సీపీ పాలనలో జరిగిన హత్యలపై టీడీపీ అధినేత చంద్రబాబు మరో వీడియో విడుదల చేశారు. క్యాంపెయిన్లో భాగంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల హత్యలను ప్రస్తావిస్తూ వీడియో ట్వీట్ చేశారు. రాష్ట్రంలో కేవలం వారం రోజుల వ్యవధిలో జరిగిన నేరాలపై నాలుగేళ్ల నరకం అంటూ కొద్ది రోజుల క్రితం తొలి వీడియో విడుదల చేసిన చంద్రబాబు... హత్యా రాజకీయాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ నేడు మరో వీడియో విడుదల చేశారు. ముఖ్యమంత్రి జగన్ ఎంత సున్నితంగా మాట్లాడటానికి ప్రయత్నించినా, కరుణామయుడిలా మరెంత నటించినా లోపలున్న క్రూరమైన వ్యక్తిత్వం బయటపడుతూనే ఉంటుందని మండిపడ్డారు. ఆ వ్యక్తిత్వమే ఆయన అనుచరులకు మార్గదర్శకత్వం అవుతుందని... చివరకు అదే రాష్ట్రాన్ని రావణకాష్టంలా మారుస్తుందన్నారు. మంగళగిరికి చెందిన ఉమా మహేశ్వర్ యాదవ్, పల్నాడులో చంద్రయ్య, జల్లయ్య, ప్రొద్దుటూరులో నందం సుబ్బయ్య, కర్నూలులో మంజుల సుబ్బారావు హత్యలను వీడియోలో ప్రస్తావించారు. వైఎస్సార్సీపీ హింసా రాజకీయాలపై రాష్ట్రమా..? రావణ కాష్టమా? అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.