TDP Bus Yatra: "అరాచక పాలనను సాగనంపడానికి ప్రజలు సిద్ధమవుతున్నారు" - భవిష్యత్తుకు గ్యారెంటీ
🎬 Watch Now: Feature Video

TDP Chaitanyaradham Bus Yatra: జగన్ పాలనపై ప్రజలు విసుగు చెందారని.. వైసీపీని ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశం పార్టీ నేతలు వ్యాఖ్యానించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలో భవిష్యత్తుకు గ్యారెంటీ చైతన్య రథం బస్సు యాత్రను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు రఘురాము, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎమ్మెల్సీ అశోక్ బాబు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, తదితరులు హాజరయ్యారు. రాజమండ్రి మహానాడులో ప్రకటించిన మేనిఫెస్టో ప్రజల భవిష్యత్‌కు గ్యారెంటీ అని.. ఆ మేనిఫెస్టోను జనాల్లోకి తీసుకోని వెళ్తున్నామని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకుల ఆస్తులు ఎలా కూల్చాలి అన్నది ఆలోచిస్తుంది తప్ప.. ప్రజలకు ఏమి చెయ్యాలో ఆలోచించడం లేదని విమర్శించారు. టీడీపీ ప్రకటించిన మేనిఫెస్టోతో వైసీపీ పతనం ప్రారంభమైందన్నారు. వైసీపీ పాలన పట్ల రాష్ట్ర ప్రజలు విసిగెత్తి ఉన్నారని.. అరాచక పాలనను ఓడించడానికి సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోలో అన్ని వర్గాల ప్రజలకు ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు. మొగల్రాజపురం రావిచెట్టు సెంటర్లో తెలుగుదేశం నాయకులు రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు.