TDP Anagani Letter to Central Home Secretary బాబు అరెస్టుపై కేంద్ర హోం శాఖకు లేఖ రాసిన అనగాని.. నిరసనలు చేస్తున్నవారిని ప్రభుత్వం వేధిస్తుందంటూ ఫిర్యాదు! - Letter to Central Secretary on Chandrababu arrest

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 17, 2023, 2:25 PM IST

TDP Anagani Letter to Central Home Secretary: చంద్రబాబు అరెస్టుపై కేంద్ర హోం శాఖ సెక్రటరీకి టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ లేఖ రాశారు. చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ రోడ్లపైకి వస్తున్న ప్రజలు, ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీలను వేధిస్తున్నారని పేర్కొన్నారు. బ్రిటీష్ పాలనలో కూడా లేని ఆంక్షలను రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అమలు చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. వైసీపీ నేతలకు వర్తించని 144 సెక్షన్ ప్రతిపక్షాలకు వర్తిస్తుందా..?అని ప్రశ్నించారు. 144 సెక్షన్​ను, పోలీస్ యాక్ట్ 30ని దుర్వినియోగానికి పాల్పడుతున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

శాంతీయుత నిరసనల్లో పాల్గొనవద్దని ఏ విధంగా నోటీసులు ఇస్తారని నిలదీశారు. అక్రమ అరెస్టులు, అక్రమ నిర్బంధాలు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనన్నారు. కాలేజీ యాజమాన్యాలను బెదిరించడం, విద్యార్థులపై కేసులు నమోదు చేయటం ప్రభుత్వ కక్షసాధింపు చర్యలకు నిదర్శనమని దుయ్యబట్టారు. వైసీపీ సభలకు బలవంతంగా విద్యార్థులను తరలిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతల సభలకు స్వచ్ఛందంగా వస్తుంటే అడ్డుపడుతున్నారని ఆక్షేపించారు. నిరసనల్లో పాల్గొంటే 307 వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నారన్నారు. పోలీసుల అధికార దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. 

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.