'పొలానికి వెళ్తున్నాని చెప్పాడు - తెల్లారేసరికి శవమయ్యాడు' దళిత సంఘ నాయకుల ఆందోళన - ap district news
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 25, 2023, 5:31 PM IST
Suspicious death of farmer : తూర్పుగోదావరి జిల్లా పంట పొలాల్లో అనుమానస్ఫదంగా ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కలకలం రేపింది. చాగల్లు మండలం చంద్రవరం గ్రామానికి చెందిన జొన్న కూటీ లక్ష్మణ్ ఆదివారం రాత్రి ద్విచక్ర వాహనంపై బయటికి వెళ్లాడు. కాగా, గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి పొలాల్లో పడేశారని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని లక్ష్మణ్ మృతదేహన్ని పరిశీలించారు. అతని ద్విచక్రవాహనం ముందు భాగం ధ్వంసమైయినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
Dalit Community Leaders Demand Justice for the Victim's Family : లక్ష్మణ్ మృత దేహన్ని శవ పరీక్షలు నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసున్నామని పేర్కొన్నారు. లక్ష్మణ్ మృతి చెందడానికి కారణమైన వారిని శిక్షించి బాధిత కుటుంబానికి న్యాయం చేయలని దళిత సంఘం నేతలు డిమాండ్ చేశారు.