ఆర్5 జోన్‌ అంశంపై విచారణ ఏప్రిల్‌కు వాయిదా వేసిన సుప్రీం కోర్టు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 5, 2024, 5:39 PM IST

Supreme Court adjourned hearing on R5 zone issue to April: ఆర్5 జోన్‌ అంశంపై దాఖలైన పిటిషన్ల విచారణను సుప్రీంకోర్టు (Supreme Court) ఏప్రిల్‌కు వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా ధర్మాసనం వెల్లడించింది. ఏప్రిల్‌లో "నాన్ మిస్లేనియస్ డే" రోజు తుది విచారణ జరుపుతామని ధర్మాసనం స్పష్టంచేసింది. వెంటనే జోక్యం చేసుకుని విచారణ జరపాలన్న రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ విజ్ఞప్తిని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం తోసిపుచ్చింది. 

రాజధాని అమరావతికి (Amaravati) సంబంధించిన ప్రధాన పిటిషన్ ఇదే ధర్మాసనం ముందు పెండింగ్‌లో ఉందని రైతుల తరపు న్యాయవాది దేవదత్ కామత్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం పేదలకు సెంటు భూమి ఇచ్చి ఇళ్లు కట్టించేందుకు చేసిన ప్రయత్నాలను అడ్డుకున్నారని సింఘ్వీ వాదించగా, ఏం జరుగుతుందో తమకన్నీ తెలుసునని జస్టిస్ సంజీవ్ ఖన్నా వ్యాఖ్యానించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.