Students Protest: రాత్రివేళ.. జోరువాన.. హాస్టల్​ విద్యార్థుల నిరసన - సంక్షేమ హాస్టల్ సమస్యలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 27, 2023, 4:57 PM IST

Students Protest Against Warden : కడప జిల్లా ప్రకాశ్‌నగర్‌లోని ఎస్సీ సంక్షేమ వసతి గృహంలో భోజనం సరిగా లేదంటూ విద్యార్థులు బుధవారం రాత్రి కలెక్టర్‌ కార్యాలయం ఎదుట బైఠాయించారు. వసతి గృహంలో తయారు చేసిన భోజనాన్ని కలెక్టరేట్‌ వద్దకు తీసుకు వచ్చి వార్డెన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కడప సంక్షేమ వసతి గృహ అధికారులు విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం అవలంబిస్తున్నారని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి వలరాజు ఆరోపించారు. విద్యార్థులు భోజనం గిన్నెలతో కలెక్టరేట్‌ వరకు ర్యాలీగా.. జోరువానలోనే నిరసన హోరు సాగించారు. ఈ సందర్భంగా వలరాజు మాట్లాడుతూ.. ఏడాది కిందట ఇదే సమస్య తలెత్తిందని తాజాగా విద్యార్థులు భోజనం, రసం బాగాలేదంటూ వార్డెన్‌ దృష్టికి తీసుకెళ్తే విద్యార్థులను దుర్భాషలాడుతూ ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ నిర్లక్ష్య సమాధానం ఇచ్చారని పేర్కొన్నారు. సంక్షేమ వసతి గృహాల్లో నాణ్యమైన భోజనం అందిస్తున్నామంటూ గవర్నమెంట్ ఊదరగొడుతున్నా క్షేత్రస్థాయిలో పట్టించుకునే నాథుడే కరవయ్యాడని ఆరోపించారు. తక్షణమే వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పడంతో వారు నిరసన కార్యక్రమాన్ని విరమించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.