SSC Exam Pattern change పదో తరగతి పరీక్షల ప్రశ్నాపత్రాల్లో మార్పులు..! ఏపీ విద్యాశాఖ ఉత్తర్వులు..
🎬 Watch Now: Feature Video
SSC Exam Papers Pattern Change: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో.. మొదటి, రెండో భాషా ప్రశ్నాపత్రాల్లో మార్పు చేర్పులు చేస్తూ డైరెక్టరేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది నుంచే వార్షిక పరీక్షల్లో నూతన మార్పులు అమల్లోకి రానున్నాయి. తెలుగు, హిందీ, ఉర్దూ, ఒడియా, కన్నడ, తమిళ భాషా ప్రశ్నాపత్రాల్లో మార్పులు చేయాలని గతంలో నిర్ణయించింది. సెకండ్ లాంగ్వేజ్ హిందీ, తెలుగు ప్రశ్నాపత్రాల్లోనూ మార్పు చేర్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రశ్నాపత్రాల్లో మార్పులపై వెబ్ సైట్‌లో బ్లూ ప్రింట్ పెట్టినట్టు.. డైరెక్టరేట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ తెలిపింది. వెయిటేజితో పాటు మోడల్ పేపర్లను వెబ్ సైట్‌లో ఉంచినట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. సామాన్యశాస్త్రం ప్రశ్నాపత్రం మోడల్ పేపర్‌ను కూడా త్వరలోనే.. వెబ్సైట్లో పెడతామని పేర్కొంది. ఆంగ్లం, గణితం, సాంఘిక శాస్త్రం ప్రశ్నాపత్రాల్లో ఎలాంటి మార్పులూ లేవని డైరెక్టరేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ స్పష్టం చేసింది. ఈ మార్పులపై ఉపాధ్యాయులు.. విద్యార్దులకు సమాచారం చేరవేసి, పరీక్షల్లో మార్పులపై అవగాహన కల్పించాలని ఉన్నతాధికారులు సూచించారు.