శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తిక పూజలు - కాలభైరవునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 22, 2023, 1:44 PM IST
Special Pujas to Kalabhairav in Srikalahasteeshwara : కార్తిక మాసం పురస్కరించుకొని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయం ప్రాంగణంలోని కాలభైరవునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. మొదట ఆలయంలోని ఊంజల్ సేవ మండపం ఎదుట ఆకాశ దీపాన్ని వెలిగించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య దీప, ధూప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.
Historical Background : తిరుపతికి 36 కి.మీ దూరంలో.. సువర్ణముఖీ నది తీరాన శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం కొలువైంది. ఈ దేవస్థానం దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ శివాలయాల్లో ఒకటి. ఈ దేవస్థానాన్ని రాహు-కేతు క్షేత్రంగా, దక్షిణ కైలాసంగా పరిగణిస్తారు. సాలెపురుగు, పాము, ఏనుగుల పేరు మీద.. ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంగా ప్రసిద్ధి చెందినట్లు స్థల పురాణం చెపుతుంది. ఈ దేవస్థానం నిర్మాణంలో ఓ ప్రత్యేకత ఉంది. ఈ దేవస్థానం నిర్మాణంలో ఓ ప్రత్యేకత ఉంది. వినాయకుడు, శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు, దక్షిణమూర్తి ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కునకు అభిముఖులై ఉన్నారు.