TDP leaders Solidarity Yatra: ప్రజాప్రభుత్వం కోసమే.. వాళ్లిద్దరూ ప్రజల మధ్య ఉన్నారు: బుద్దా వెంకన్న - Lokesh Padayatra is completing 100 days
🎬 Watch Now: Feature Video
TDP leaders Solidarity Yatra: అరాచక శక్తుల నుంచి రాష్ట్రాన్ని కాపాడాలనే లక్ష్యంతోనే నారా లోకేశ్ పాదయాత్ర చేస్తున్నారని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. యువగళం పాదయాత్ర వంద రోజులు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో.. విజయవాడలో టీడీపీ శ్రేణులు దుర్గమ్మ ఆలయం వరకు సంఘీభావ యాత్ర నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో వంద కొబ్బరికాయలు కొట్టారు. 2024లో అధికారంలోకి వచ్చేది తెలుగుదేశమేనన్న బుద్దా వెంకన్న.. 175 నియోజకవర్గాల్లో లోకేశ్ పాదయాత్ర విజయవంతం కావాలని కోరుకున్నారు. జనసేన, తెలుగుదేశం పొత్తు కుదుర్చుకుంటే వైసీపీకి ఎందుకు వణుకు మొదలైందని ప్రశ్నించారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే వైసీపీ నాయకులు.. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ఎందుకు విఫలమయ్యారని మండిపడ్డారు. వైసీపీ అరాచక ప్రభుత్వాన్ని ఓడించాలన్న లక్ష్యంతోనే చంద్రబాబు, లోకేశ్‌లు.. నిరంతరం ప్రజల మధ్యన ఉంటున్నారని బుద్దా వెంకన్న స్పష్టం చేశారు. చంద్రబాబు, లోకేశ్‌లకు మద్దతుగా.. తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని బుద్దా వెంకన్న తెలిపారు.