దీపావళి వేళ కందిపప్పు కోసం పేదల ఎదురు చూపులు - పండుగ వేళ కందిపప్పు కొరత ఏపీ
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 9, 2023, 10:49 AM IST
Shortage of Pulses in Rationcard Holders in Vijayawada : దీపావళి పండుగ వేళ కందిపప్పు కోసం పేదల ఎదురు చూపులు చూస్తున్నారు. మోపిదేవి, అవనిగడ్డ, కోడూరు, చల్లపల్లి, నాగాయలంక మండలాల్లో రేషన్ కార్డుదారులకు కందిపప్పు ఇవ్వడానికి సుమారు 25 టన్నులు కావాల్సి ఉండగా ప్రస్తుతం నాగాయలంక మండల స్టాక్ పాయింట్ కి 10 టన్నుల కందిపప్పు మాత్రమే చేరిందని మరికొన్ని రోజుల్లో ఇంకో 15 టన్నుల కందిపప్పు వస్తుందని అధికారులు తెలిపారు. పండుగకు అందరికి కందిపప్పు ఇస్తారని ఆశపడిన ప్రజలకు నిరాశే ఎదురైందని అంటున్నారు. ఒక్కో డీలర్‌కు 50 నుండి 100 కేజీలు కందిపప్పు మాత్రమే ఇవ్వడంతో పేదలు పప్పు అన్నం కి కూడా దూరం అయ్యామని నిరాశ చెందుతున్నారు.
NO Eedgram in Ration In AP : చంద్రబాబు హయాంలో పేదలకు కిట్ రూపంలో అనేక సరుకులు ఉచితంగా ఇచ్చేవారని అన్నారు. కొన్ని స్టాక్ పాయింట్లలో పంచదారను తీసుకున్న వారికే మళ్లీ ఇస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్డుల ప్రకారం చెక్కరను డీలర్లకు విడుదల చేయకపోవడంతో పేదలు మార్కెట్ లో అధిక రేట్లకు కొనుగోలు చేయక తప్పడం లేదని వాపోతున్నారు. ఈ పోస్ మిషన్ కు కొన్ని చోట్ల సిగ్నల్ రాకపోవడంతో కార్డు దారులు పడిగాపులు పడాల్సి వస్తుంది