పన్ను చెల్లించని దుకాణదారులు - నోటీసులు ఇవ్వకుండానే మూసివేసిన అధికారులు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 15, 2023, 3:36 PM IST
Shops Closed in Kurnool for Non payment Tax: ప్రభుత్వం వేసే వివిధ రకాల పన్ను(tax) భారాలతో జనం అల్లాడుతున్నారు. తాజాగా కర్నూలు జిల్లా గాంధీనగర్లో ప్రభుత్వం చెత్తపన్ను విధించింది. 8 నెలల చెత్తపన్ను కట్టాలంటూ మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో స్థానిక దుకాణాదారులకు ప్రభుత్వం హుకుం జారీ చేసింది. చెత్త పన్ను వసూలు కోసం నగరపాలక సంస్థ అధికారులు రాత్రివేళల్లో విధులు నిర్వహించడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Without any Notice Shops being Closed: గాంధీనగర్లో వ్యాపారులు చెత్తపన్ను(Garbage tax), ట్రేడ్ లైసెన్సు(trade license) ఫీజులు చెల్లించాలని అధికారులు వెంటపడ్డారు. పన్ను చెల్లించని వ్యాపారుల దుకాణాలకు అధికారులు తాళాలు వేశారని షాపు యజమానులు వాపోయారు. ఎందుకు తాళాలు వేస్తున్నారని ఓ దుకాణదారుడు ప్రశ్నించగా.. అధికారులను అడగండి అంటూ సిబ్బంది సమాధానం ఇచ్చారు. పన్ను విషయంలో తమకు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఒకే సారి వచ్చి పాత బకాయిలతో పాటు మొత్తం చెల్లించమంటే ఎలా అని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దిక్కుతోచని పరిస్థితుల్లో కొంత మంది వ్యాపారులు చెత్తపన్ను, ట్రేడ్ లైసెన్సులు ఫీజులు చెల్లించి తాళాలు వేసిన దుకాణాలను తిరిగి తెరుచుకున్నారు. ఓ షాపు యజమాని వ్యక్తిగత పనుల కోసం షాపుకు తాళం వేసుకుని వెళ్లాడు. ఆ సమయంలో అధికారులు తాళం వేసిన షాపుకు మరో తాళం వెయ్యడంతో షాపు యజమానికి దిక్కుతోచని పరిస్థితి నెలకొంది.
TAGGED:
గాంధీనగర్ తాజా వార్తలు