అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై చేయి చేసుకున్న డిప్యూటీ తహసీల్దార్ - వీడియో వైరల్ - Shiva Insulted Prabhavati Went To The Stock Point

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 3, 2023, 12:12 PM IST

Shiva Insulted Prabhavati Went To The Stock Point: శ్రీ సత్య సాయి జిల్లా పెనుగొండ గ్రామంలో పౌరసరఫరాల డిప్యూటీ తహసీల్దారుగా(Deputy Tahsildar of Civil Supplies) పనిచేస్తున్న ప్రభావతి స్టాక్ పాయింట్​లో ప్రైవేటుగా పనిచేస్తున్న శివ అనే వ్యక్తిపై చేయి చేసుకున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్​ అవుతోంది. సోమందేపల్లి, రొద్ధం, పెనుగొండలో పౌరసరఫరాల దుకాణాలను పరిశీలించే  పౌరసరఫరాల డిప్యూటీ తహసీల్దారుగా ప్రభావతి పనిచేస్తోంది. పెనుగొండలో స్టాక్ పాయింట్​లో ప్రైవేటు వ్యక్తిగా పనిచేస్తున్న శివ ప్రభావతిని నవంబర్ 29వ తేదీ బుధవారం అసభ్యంగా దూషించడంతో స్టాక్ పాయింట్ వద్దకు వెళ్లి శివపై ప్రభావతి చేయి చేసుకుంది. 

ఈ వ్యవహరమంతా సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఈ విషయమే అధికారులు ప్రభావతికి ఫోన్ చేసి సంప్రదించగా శివపై భౌతిక దాడికి పాల్పడింది వాస్తవమేనని అతను అసభ్యంగా మాట్లాడటం వల్ల కోపం తట్టుకోలేక చేయి చేసుకున్నానని ఆమె తెలిపింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్​గా మారింది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.