Sexual Harassment: తల్లికి కూడా చెప్పుకోలేక పోయిందా బాలికా..! గురుకుల పాఠశాలలో లైంగిక వేధింపులు! - పాఠశాలలో లైంగిక వేధింపులు
🎬 Watch Now: Feature Video
Harassment in Gurukula School: స్కూళ్లు ప్రారంభమయ్యాయి. కానీ తన కుమార్తె మాత్రం పాఠశాలకు వెళ్లడానికి నిరాకరించింది. ఎంత చెప్పినా సరే వెళ్లనని మొండికేసింది. ఎనిమిదవ తరగతి చదువుతున్న ఆ విద్యార్థిని ఏమని చెప్పగలదు. పాఠశాలలోని ఓ ఉద్యోగి తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని చెప్పలేకపోయింది. దీంతో పాఠశాలకు వెళ్లమని తల్లి గట్టిగా చెప్పడంతో.. కన్నీరు పెట్టుకుంటూ తన బాధను చెప్పుకుంది.
అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థిని ఎనిమిదో తరగతి చదువుతోంది. పాఠశాలలోని ఓ ఉద్యోగి తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని, దీనికి మరో మహిళా ఉద్యోగి సహకరిస్తున్నట్లు.. విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పాఠశాలలోని ఇతర విద్యార్థినులను పోలీసులు ఆరా తీసినట్లు.. అదే విధంగా పాఠశాల ప్రధాన అధికారిణితో ఫోన్లో మాట్లాడి వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది.
విద్యార్థి సంఘాల నాయకుల ఆందోళన: ఎనిమిదవ తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో.. విద్యార్థి సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. పాఠశాల వద్ద టీఎన్ఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు ధర్నా చేపట్టారు. మైనర్ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడినవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.