చంద్రమోహన్ మరణం తీవ్ర వేదనను మిగిల్చింది - సోదరి ఎంఎన్ కుమారి - చంద్రమోహన్ మృతి చిరంజీవి
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 11, 2023, 5:39 PM IST
Senior Telugu Actor Chandra Mohan dies: చంద్రమోహన్ మృతిపై ఆయన సోదరి ఎంఎన్ కుమారి స్పందించారు. కృష్ణా జిల్లాలోని తమది ఒక ఉమ్మడి కుటుంబం అని, అక్కడి నుంచి చంద్రమోహన్ బాపట్లలోని వ్యవసాయ కళాశాల అగ్రికల్చర్ బిఎస్సీ పూర్తి చేశారని తెలిపారు. అక్కడే కొంత కాలం ఉద్యోగం చేసినట్లు ఆమె పేర్కొన్నారు. చంద్రమోహన్ మరణం తమకు తీవ్ర వేదనను మిగిల్చిందని ఎంఎన్ కుమారి అన్నారు.
ఎంఎన్ కుమారి విశాఖలో మానసిక వికలాంగులు, అనాధలకోసం ఒక శరణాలయాన్ని నడుపుతున్నారు. ఈ తరహా పిల్లల కోసం ప్రత్యేక పాఠశాల కూడా నడుపుతున్నారు. ఇటీవలే ఈ శరణాలయాన్ని అద్దె ఇళ్లలలో నడపడం కష్టమవుతోందని తన సోదరుడు చంద్రమోహన్ చెప్పినట్లు తెలిపారు. వెంటనే స్పందించిన ఆయన కొంత సొమ్ము అందించి సొంత భవనం కోసం స్ధలాన్ని తీసుకోవాలని సూచించినట్లు గుర్తు చేసుకున్నారు. రాఖీ పౌర్ణమికి తన అన్నయ్య చంద్రమోహన్ వద్దకు వెళ్లి అనందంగా గడిపిన వివరాలను గుర్తు చేసుకున్నారు. ఏడాది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సోదరుడి మరణంతో తాము పెద్ద అండను కొల్పోయామని ఎంఎన్ కుమారి ఆవేదన వ్యక్తం చేశారు.