అంతర్జాతీయ రెండో తెలుగు మహాసభలు- పెద్దఎత్తున హాజరైన కవులు, రచయితలు - తెలుగు మహాసభలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 7, 2024, 5:11 PM IST

Second International Telugu Mahasabhalu At Rajahmundry: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని గైట్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో అంతర్జాతీయ రెండో తెలుగు మహాసభలు మూడో రోజు ఘనంగా కొనసాగుతున్నాయి. కవిత సమ్మేళనాలు, కవులు, రచయితలు, సాహితీ ప్రియులు, భాషాభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రవాసాంధ్రుల సాహితీ తపస్సు-సదస్సు, ఆకాశవాణి, దూరదర్శన్ బుల్లితెరలలో తెలుగు వికాసం, ఆధునిక సాహిత్య సదస్సు, ప్రదర్శనాత్మక కళల సాహిత్య సదస్సు, హాస్య, వ్యంగ, చమత్కార సాహిత్య సదస్సులు నిర్వహించారు. వాటితో పాటు మాతృభాష ఉనికి కర్తవ్యాల సదస్సు, తెలుగు భాష మనోవిజ్ఞాన శాస్త్ర సదస్సులను నిర్వహించారు. 

రచనల ద్వారా మాతృ భాషపై తమకున్న మమకారాన్ని చాటుకున్నారు. తెలుగుపై ఉన్న భాషాభిమానం తమను అంతర్జాతీయ తెలుగు మహాసభలకు వచ్చేలా చేసిందని పలువురు రచయితలు అభిప్రాయపడ్డారు. విద్యార్థుల కళా, నృత్య ప్రదర్శనలు భాషాభిమానుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. తెలుగు భాషకు తిరుగులేదు అనిపించే విధంగా సభలు నిర్వహించటం వల్ల ఎంతో ఆనందకరంగా ఉందని అక్కడికి వచ్చిన ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ప్రజల మాటల్లో మాతృభాష కరవైందని ఉపాధ్యాయులు తెలిపారు. తల్లిదండ్రులను గౌరవించటంతో పాటు సాహిత్యాన్ని ఎన్నడూ మరచిపోకూడదని రచయితలు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.