Students Arrest in Ganja: ఈజీ మనీ కోసం తప్పుదారి.. గంజాయి విక్రయిస్తూ ఇద్దరు విద్యార్థులు అరెస్ట్ - తాడేపల్లిలో గంజాయి విక్రయిస్తున్న విద్యార్థులు
🎬 Watch Now: Feature Video
Ganja Selling Students Arrested: గుంటూరు జిల్లా తాడేపల్లిలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు విద్యార్థులను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు అరెస్టు చేశారు. తాడేపల్లిలోని ప్రైవేట్ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న.. ఒడిశాకు చెందిన ఇద్దరు విద్యార్థులు గంజాయి తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. ఈ ఇద్దరు విద్యార్థులు ఒడిశా నుంచి గంజాయిని తీసుకొచ్చి తాడేపల్లిలో విక్రయిస్తున్న సమయంలో పట్టుకున్నామని అధికారులు చెప్పారు. వీరి నుంచి గంజాయి కొనుగోలు చేస్తున్న మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేశామని తెలిపారు. కొన్నేళ్లుగా అదే కాలేజీకి చెందిన విద్యార్థులు గంజాయి బారిన పడుతున్నారని సెబ్ అధికారులు చెప్పారు. గంజాయి అక్రమ రవాణాను నివారించడానికి తమ వంతు కృషి చేస్తున్నామని సెబ్ అధికారి డీఎన్ మహేష్ తెలిపారు. కష్టపడకుండా.. ఈజీగా మనీ సంపాదించాలని యువత తప్పుదారి పడుతున్నారని అన్నారు. గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని చెప్పారు. సమాజాన్ని పాడు చేయడానికి చూస్తే.. ఎవరైనా సరే కఠిన చర్యలు తీసుకుంటామని సెబ్ అధికారులు హెచ్చరించారు. వారిపై కేసులు నమోదు చేస్తున్నామని పేర్కొన్నారు.