స్టీరింగ్ రాడ్ విరిగిపోయి పంటకాల్వలో స్కూల్ బస్ పల్టీ - విద్యార్థులు సేఫ్ - ఏపీ లేటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 6, 2023, 12:21 PM IST
School Bus Accident in Krishna District: కృష్ణా జిల్లా కోడూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం.. తప్పింది. విశ్వనాథపల్లె నుంచి అవనిగడ్డకు వెళ్తున్న ప్రైవేటు స్కూలు బస్సుకు స్టీరింగ్ రాడ్ విరిగిపోవటంతో కాలువలో బోల్తా పడింది. అయితే ఆ సమయంలో పంట కాలువలో సాగునీరు లేకపోవటం వల్ల బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. అవనిగడ్డ నుంచి కోడూరు రహదారి గుంతలమయంగా ఉండటంతో తరచూ ఇలా ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు తెలిపారు.
Damaged Roads in AP: ఎండొస్తే రోడ్లపై ఉన్న గుంతలు, గతుకుల మధ్య దుమ్మూ, ధూళి రేగి ప్రమాదాలకూ కారణమవుతున్నాయని.. ఇక చిన్నపాటి వర్షానికి కూడా దారులన్నీ చెరువుల్లా మారిపోతున్నాయని స్థానికులు వాపోయారు. దీంతో ఈ రహదారులపై ప్రయాణమంటేనే భయం వేస్తోందని తెలిపారు. దీనిపై అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేదని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు దీనిపై స్పందించి వెంటనే తమ ప్రాంతంలో రహదారి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.