ETV Bharat / state

సీఎం చంద్రబాబు ఇంటికి అమిత్ షా - అరగంట సేపు ఏకాంతంగా చర్చలు! - AMIT SHAH CM CHANDRABABU MEETING

చంద్రబాబు నివాసంలో విందుభోజనానికి అమిత్‌షా హాజరు - విశాఖ ఉక్కుకు ప్యాకేజీ ప్రకటించినందుకు సీఎం ధన్యవాదాలు - విందు సమయంలో వివిధ అంశాలపై ఆరా తీసిన అమిత్‌షా

Union Minister Amit Shah Attends Dinner at CM Chandrababu House
Union Minister Amit Shah Attends Dinner at CM Chandrababu House (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 19, 2025, 7:55 AM IST

Union Minister Amit Shah Attends Dinner at CM Chandrababu House : విశాఖ ఉక్కు కర్మాగారం తెలుగుజాతి మనోభావాలతో ముడిపడిన అంశం కాబట్టే ప్యాకేజీ ఇచ్చి ఆదుకున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు. విశాఖ ఉక్కుకు మంచి భవిష్యత్‌ ఉందన్న ఆయన అందరూ సమిష్టిగా కృషి చేసి లాభాల్లోకి తీసుకురావాలని చంద్రబాబుకు సూచించారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని మరోసారి చంద్రబాబు గుర్తుచేయగా ఈ అంశం కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉందంటూ పురందేశ్వరి ప్రస్తావించారు. భారతరత్నకు ఎన్టీఆర్ అన్ని విధాల అర్హుడని అమిత్‌షా అన్నారు. సీఎం నివాసంలో విందుకు హాజరైన అమిత్‌షా వివిధ అంశాలపై చర్చించారు.

గన్నవరంలో జరిగే NDRF వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్రానికి వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా గౌరవార్థం ముఖ్యమంత్రి చంద్రబాబు తన నివాసంలో విందు ఏర్పాటు చేశారు. గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా ఉండవల్లిలోని సీఎం నివాసానికి చేరుకున్న అమిత్‌షాకు చంద్రబాబుతోపాటు పవన్‌కల్యాణ్, లోకేశ్ స్వాగతం పలికారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి కేంద్రం భారీ ప్యాకేజీ ప్రకటించినందుకు అమిత్‌షాకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.

అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాల్లోని ఇళ్ల రెగ్యులరైజేషన్​కు కేబినెట్ ఓకే- అయితే?

అనంతరం ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని కోరారు. జాతీయస్థాయిలో కాంగ్రెస్ వ్యతిరేక శక్తులన్నింటినీ ఆయన ఏకం చేసినట్లు చంద్రబాబు గుర్తు చేశారు. సినిమా రంగానికి, రాష్ట్రానికి ఆయన చేసిన సేవల్ని వివరించారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని కోరుతూ కేంద్రానికి విజ్ఞాపనపత్రం ఇచ్చామని అంది పెండింగ్‌లో ఉందని పురందేశ్వరి అమిత్‌షాకు గుర్తు చేశారు. NTR గొప్ప నాయకుడని భారతరత్నకు అన్ని విధాల అర్హులని అమిత్‌షా అన్నారు. అనంతరం సీఎం చంద్రబాబుతో అమిత్‌షా అరగంట సేపు ఏకాంతంగా చర్చలు జరిపినట్లు తెలిసింది.

చర్చలు పూర్తయిన తర్వాత కృష్ణనది ఒడ్డున లాన్‌లో ఏర్పాటు చేసిన విందుకు అమిత్‌షా హాజరయ్యారు. విందు సమయంలో రాష్ట్రానికి సంబంధించి వివిధ అంశాలపై అమిత్‌షా ఆరా తీశారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా ఏ పంటలు పండుతాయని అడిగినట్లు తెలిసింది. వరి, మిర్చితోపాటు రాయలసీమలో ఉద్యాన పంటలు సాగవుతాయని చంద్రబాబు వివరించారు. భూముల ధరల గురించి ప్రస్తావనకు రాగా ఒకప్పుడు ఆంధ్రాలో ఎకరం అమ్మితే హైదరాబాద్‌లో ఐదు ఎకరాలు కొనుగోలు చేసేవారని ఇప్పుడు అక్కడ ఎకరం అమ్మితే ఇక్కడ 50 ఎకరాలు కొనొచ్చని చంద్రబాబు వివరించారు.

కోడిపందేలపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు - ఏమన్నారంటే !

గోదావరికి సంబంధించి అంతరాష్ట్ర సమస్యలేమైనా ఉన్నాయా అని అమిత్‌షా అడగ్గా ప్రస్తుతానికి గోదావరితో పెద్ద సమస్యలేమీ లేవని, కృష్ణానదికి సంబంధించే వివాదాలు తలెత్తే అవకాశం ఉందని సీఎం వివరించినట్లు తెలిసింది. పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్ట్‌ గురించి సీఎం వివరించారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సీఎంగా ఎన్నాళ్లు పనిచేశారని అమిత్‌షా ఆరా తీశారు. కాంగ్రెస్‌కు తరుచూ ముఖ్యమంత్రులను మార్చే సంస్కృతి ఉంది కదా అలాంటప్పుడు ఇక్కడ ఎక్కువకాలం ఎవరు పనిచేశారని అడగ్గా కాసు బ్రహ్మానందరెడ్డి ఎక్కువ కాలం పనిచేయగా ఆ తర్వాత రాజశేఖర్‌రెడ్డి ఆరేళ్లు సీఎంగా ఉన్నారని చంద్రబాబు బదులిచ్చారు.

విందులో తనకు వడ్డించిన పదార్థాలను చూసి ఇది తనకు మూడురోజులకు సరిపడేలా ఉందని అమిత్‌షా చమత్కరించారు. ప్లేట్‌లో అరిటాకు పరిచి అందులో భోజనం పెట్టగా దాని గురించి అమిత్‌షా అడిగి తెలుసుకున్నారు. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో అరిటాకులో భోజనం చేయడం తెలుగువారి ప్రత్యేకత అని పురందేశ్వరి వివరించారు. ఇక్కడి ప్రజలు మిఠాయిలు ఎక్కువగా తింటారా? అని అమిత్‌షా ప్రశ్నించారు. మీరు పూర్తి శాఖాహారా అని సీఎం చంద్రబాబు అమిత్‌షాను అడగ్గా మా కుటుంబంలో ఆరు తరాలుగా తామంతా శాఖాహారులమేనని బదులిచ్చారు. దాదాపు గంటన్నరపాటు సీఎం నివాసంలో ఉన్న అమిత్‌షా ఆ తర్వాత బయలుదేరి విజయవాడ వెళ్లారు.

మైండ్‌ను కంట్రోల్​లో పెట్టాలి - 'స్వచ్ఛ ఆంధ్ర'కై పని చేయాలి: సీఎం చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.