నిధులు లేక నిలిపివేసిన నాడు-నేడు పనులు - శిధిల భవనంలోనే తరగతుల నిర్వహణ
🎬 Watch Now: Feature Video
School Building Construction Stopped Lack of Nadu Nedu Fund: నాడు -నేడు కార్యక్రమం కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామంటూ అధికార పార్టీ నేతల ప్రచారాలు చేస్తున్నారు. కాని చేసే ప్రచారానికి క్షేత్రస్థాయిలో జరిగే మౌలిక వసతులకు పొంతన ఉండటం లేదు. పాఠశాలల విలీన ప్రక్రియ వల్ల కొన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగింది. దీంతో విద్యార్థులకు సరిపడా తరగతి గదులు లేక పిల్లలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
Students Get Panic of Old Building: పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని ఎస్‌ఆర్‌బీఎన్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 87 మంది విద్యార్థులకు ఒక్క గది మాత్రమే ఉంది. నాడు-నేడు కింద నిర్మాణం చేపట్టిన పాఠశాల భవనం నిధులు లేక స్లాబ్తోనే నిలిపివేశారని ఉపాధ్యాయులు చెబుతున్నారు. దీంతో శిథిలావస్థకు చేరిన పాత భవనంలో తరగతులు నిర్వహిస్తున్నారు. పాఠశాల భవనం పూర్తిగా పాతబడి, సీలింగ్ పెచ్చులు ఊడిపోవటంతో విద్యార్థులు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రభుత్వం స్పందించి నాడు-నేడు నిధులు విడుదల చేసి, పాఠశాల నిర్మాణం పూర్తిచేస్తే విద్యార్థుల కష్టాలు తీరుతాయని ఉపాధ్యాయులు కోరుతున్నారు.