AP Sarpanch Association on Panchayat Funds ఇప్పుడైనా నిధులను విడుదల చేసి తమ అధికారాలను కాపాడండి: సర్పంచ్ల సంఘం - AP Latest News
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 24, 2023, 5:15 PM IST
AP Sarpanch Association on Panchayat Funds ప్రభుత్వం దారి మళ్లించిన పంచాయతీ నిధులను వెంటనే తిరిగి కేటాయించాలంటూ.. గ్రామ సర్పంచ్‌లు గత కొన్ని రోజుల నుంచి నిరసనలు చేస్తున్నారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను వెంటనే పంచాయతీల ఖాతాల్లో జమ చేయాలంటూ వారు ఆందోళనలు చేపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం, పంచాయతీరాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు. నిధులు లేక గ్రామాల్లో కనీసం పారిశుద్ధ్య పనులు కూడా చేపట్టలేకపోతున్నామని సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో గ్రామాల వికాసానికి కనీసం రానున్న రెండు నెలల్లోనైనా ఇవ్వాల్సిన నిధులను విడుదల చేసి సర్పంచ్ల అధికారాలను కాపాడాలని రాష్ట్ర సర్పంచ్ల సంఘం డిమాండ్ చేసింది. పండగల వేళ గ్రామంలో కనీస పారిశుద్ద్యం మెరుగుపర్చేందుకు కూడా తమకు సాధ్యం కావడం లేదని, కేంద్రం నుంచి వచ్చిన కమిటీ రాష్ట్రంలో పరిస్ధితులను చూసి ఆశ్చర్యపోయిందని సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సన్యాసినాయుడు అన్నారు. ఎన్నికల కోడ్ రాకముందే తమకు రావాల్సిన నిధుల్లో కొంతైనా ప్రభుత్వం అందివ్వాలని తద్వారా ఎన్నుకున్న సర్పంచ్లకు విలువ ఇవ్వాలని కొరుతున్నారు.